Ramoji Rao Memorial : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం చనిపోయారు. వయోభారం రీత్యా పలు రకాల ఆరోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. శనివారం ఉదయం 4గంటల 50నిమిషాలకు నానక్ రామ్ గూడ లోని స్టార్ ఆస్పత్రిలో రామోజీ రావు తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు వెంటనే స్టార్ హాస్పిటల్స్ డాక్టర్లు చికిత్స అందించారు. కానీ, రాత్రికి ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ మీదే ఉంచి చికిత్స అందించారు. కానీ, తెల్లవారుజామున 4.50 గం.కు ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తన పార్థివదేహాన్ని తరలించారు.
రామోజీ రావు గొప్ప వ్యాపార వేత్త, అనేక సంస్థలను ప్రారంభించి, ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఇది ఇలా ఉంటే రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఓ మీడియా దిగ్గజానినికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం దేశంలో ఇదే మొదటి సారి. ప్రస్తుతం రామోజీ రావు పార్థీవ దేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని సీఎం అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావు గారికి దక్కుతుంది. రామోజీరావు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తి రామోజీ రావు. పత్రికా నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో 50ఏళ్ల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ గా నడపడం, ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి బాట చూపిన దార్శనికుడు రామోజీరావు అని సీఎం అన్నారు.
ఇదిలా ఉండగా జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్నారు రామోజీరావు. ‘మరణం ఒక వరం’, ‘నాకు చావు భయం లేదు’ అని చెప్పి ఆయన చూపించారు. ఈ స్మారకం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. రామోజీరావు వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుంది. ఆయన చేసిన సేవలను భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. రామోజీరావు స్మారకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.