Viral Video : రామ్మోహన్ నాయుడు చెప్పి మరీ కొట్టాడుగా..ఆయన కాన్ఫిడెన్స్ కు మొక్కాలి భయ్యా!
Viral Video : ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి దూకుడుకు వైసీపీ పత్తా లేకుండా పోయింది. చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో టీడీపీ విజయం దక్కించుకోవడంపై శ్రేణుల సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ సంబంధిత వీడియోలు, ట్వీట్లు, కామెంట్స్, మీమ్స్ హోరెత్తుతున్నాయి. ఏపీ ప్రజలు టీడీపీకి ఆకాశమంతా విజయాన్ని అందించడంతో శ్రేణులు కూడా అదే రేంజ్ లో సంబరాలను జరుపుకుంటున్నారు. ఇక గతంలో టీడీపీ నేతల మాటలు, కష్టాలు, కన్నీళ్లు, ఇలా పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో కింజారపు రామ్మోహన్ నాయుడి వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. గత లోక్ సభలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లోక్ సభ స్పీకర్ ..రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తాడు..దానికి రామ్మోహన్ స్పీకర్ ను బతిమాలుతూ కొంచెం సేపు మాట్లాడేందుకు టైమివ్వండి సార్.. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ కచ్చితంగా భారీగా ఎంపీ సీట్లు సాధిస్తుంది..అప్పుడు ఈ ఇబ్బంది ఉండదు. నాకు మాట్లాడే సమయం ఎక్కువే వస్తుంది. కానీ ఇప్పుడు కొద్ది సేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి సార్..అని రిక్వెస్ట్ చేస్తాడు.
ఈ వీడియోలో రామ్మోహన్ మాట్లాడిన తీరు చూస్తుంటే..2024 ఎన్నికల్లో టీడీపీ వందశాతం భారీ మెజార్టీతో గెలుస్తుందనే ధీమా కనపడింది. ఆయన మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికసలాడింది. ఆయన నమ్మకాన్ని..ఇప్పుడు ఏపీ ప్రజలు నిజం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీడీపీకి అసెంబ్లీ సీట్లు కట్టబెట్టడమే కాదు..భారీగా ఎంపీ సీట్లను ఇచ్చారు.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు. ఏన్డీఏలో బీజేపీ తర్వాత అత్యంత ప్రాధాన్యం టీడీపీకే ఉండబోతోంది. ఇక రామ్మోహన్ నాయుడికి లోక్ సభలో మాట్లాడే సమయం చాలా బాగా దొరుకుతుంది. అనాడే అంత నమ్మకంగా రామ్మోహన్ నాయుడు పలికిన మాటలు..ఈనాడు నిజం కావడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు చెప్పి మరీ కొట్టాడుగా అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు.