Ramcharan and Upasana:ఫోర్బ్స్ కవర్‌పై సూపర్‌కపుల్
Ramcharan and Upasana:రామ్ చరణ్ – ఉపాసన దంపతులు రూ.2500 కోట్ల రూపాయల నికర ఆస్తులతో భారతదేశపు సరికొత్త పవర్ కపుల్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. RRR నాటు నాటు.. ఆస్కార్స్ 2023లో పురస్కారం గెలుచుకోగా, చరణ్ తాను రియల్ గ్లోబల్ స్టార్ అని నిరూపించాడు. చరణ్ – ఉపాసన జంట కపుల్ గోల్స్ విషయంలో యవజంటలు ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతుంటారు. ఒక ఫ్యామిలీ మ్యాన్ గా చరణ్ అందరి మనసుల్లో నిలిచి ఉన్నాడు.
మరోవైపు గ్లోబల్ స్టార్ గా తనను తాను నిరూపించుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లో చరణ్ ప్రయత్నాలను ఆపలేదు. బ్లాక్ బస్టర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మరో పాన్ ఇండియా ప్రయత్నం. ఆ తర్వాత కేజీఎఫ్ – సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమా చేసేందుకు ప్రణాళికల్లో ఉన్నాడు
మరోవైపు చరణ్ తన ఇమేజ్ ని ముంబై పరిశ్రమలోను పెంచుకుంటున్నాడు. హిందీ బెల్ట్ లోను ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నాడు. సొంత నిర్మాణ సంస్థను అటు హిందీ పరిశ్రమలో ఎస్టాబ్లిష్ చేసేందుకు నేరుగా ముంబైలో అడుగుపెట్టి అక్కడ సొంతంగా తనకంటూ ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసారు. చరణ్ – ఉపాసన రెగ్యులర్ గా ముంబైలోని ఈ ఇంటిని సందర్శిస్తున్నారు. అక్కడి నుంచి తమ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను చక్కబెడుతున్నారు.
ఇటీవల తమ కుమార్తె క్లిన్ కారా ఆరునెలల ఉత్సవం సందర్భంగా ముంబై మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు ఈ దంపతులు. ఇంతలోనే ఇప్పుడు ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ అందమైన జంట దర్శనమిచ్చింది. ఈ కవర్ పేజీపై చరణ్ పింక్ టీషర్ట్ లో కనిపించగా, ఎరుపురంగు డిజైనర్ దుస్తుల్లో ఉపాసన అతడి చెంత మనోహరంగా కనిపించారు. ఈ ఫోటోషూట్ యూనిక్ నెస్ తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మెగాభిమానుల్లో ఇది వైరల్ గా మారుతోంది. సూపర్ కపుల్ పై స్పెషల్ స్టోరి అంటూ ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. ఈ కథనంలో వారి కాలేజ్ డేస్ ఫ్రెండ్షిప్ నుంచి జీవిత ప్రయాణంలో ప్రతి విషయాన్ని యూనిక్ గా ప్రచురించారు.