Ramayana : రామాయణం మూవీ భారీ బడ్జెట్.. 800 కోట్లతో తీస్తున్నారా?
Ramayana : రామాయణం మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. యష్ ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా అందులో రావణుడి పాత్ర చేస్తున్నాడని వివరాలు బయటకు వచ్చాయి. దాదాపు 800 కోట్లతో తీస్తున్న ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. సీతగా సాయి పల్లవి, కైకెయి గా లారాదత్తా, హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అరుణ్ గోవిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
రామాయణం సినిమా గురించి కొన్ని ఫోటోలు, వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రేక్షకులకు తెలిసింది. కానీ సినిమా ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో ఎలాంటి లీకులు, వీడియోలు ఫొటోలు రాకూడదన్నది నిర్మాణ సంస్థతో పాటు డైరెక్టర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.
డైరెక్టర్ నితీశ్ తివారీ సెట్స్ లోకి ఎవరూ ఫోన్లు, తీసుకురావద్దని ఆదేశించాడు. అంతే కాకుండా ఎక్కడా కూడా ఈ చిత్రం గురించి అప్ డేట్స్ అఫిషీయల్ గా కాకుండా అన్ అఫిషీయల్ గా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యష్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడమే కాకుండా ఇందులో వాటా కూడా తీసుకోనున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 20 నుంచి 30 శాతం వరకు యష్ కు వాటా దక్కనుందనే తెలుస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ లో ఓం రావత్ ప్రభాస్ తో తీసిన రామాయణం మూవీ డిజాస్టర్ గా మిగిలింది. మళ్లీ ఇంత భారీ బడ్జెట్ తో మూవీ చేయాలనుకోవడం సాహాసమే అయినా దీన్ని తెరకెక్కించే విధానం మరో లెవల్ లో ఉందని ప్రచారం జరుగుతోంది. యష్ నటించినందుకు ఆయనకు దానికి తగ్గ రెమ్యూనరేషన్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెబుతున్నారు. ఇంత భారీ బడ్జెట్ మూవీపై బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాలు భారీగానే హోప్స్ పెట్టుకున్నాయి. అయితే సెట్స్ లో అనవసరమైన వ్యక్తులు రాకుండా, ఫోన్లు తీసుకురాకుండా మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రామాయణం మూవీ గురించి మేకర్స్ అఫిషీయల్ స్టేట్ మెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.