JAISW News Telugu

Ramasethu : సముద్రగర్భంలో రామసేతు వంతెన నిజమే: ఇస్రో ప్రకటన

Ramasethu

Ramasethu

Ramasethu : భారత్, శ్రీలంక మధ్య రామసేతు వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక వ్యాఖ్యలు చేసింది. రామసేతు కాల్పనికం కాదని.. నిజమేనని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్ శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కి.మీ. ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరింి ఉందని వివరించారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇస్రో వెలువరించిన ఈ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

Exit mobile version