JAISW News Telugu

Ramaiah Temple : రామయ్య ఆలయానికి 42 బంగారు తలుపులు.. వీటి కోసం ఎంత బంగారం వాడారంటే..

Ramaiah Temple

Ramaiah Temple

Ramaiah Temple : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరో మూడు రోజుల్లో జరుగబోతోంది. ఈ వేడుక కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రామాలయ విశేషాలపై ఎన్నో కథనాలు వస్తున్నాయి.

తాజాగా అయోధ్య రామమందిర స్వర్ణ ద్వారాలు ఆకట్టుకుంటున్నాయి. అయోధ్య ఆలయంలో 42 బంగారు తలుపులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం వంద కిలోల బంగారంతో తలుపులకు పసిడి పూత పూశారు. ఇక ఆలయంలోని మొదటి బంగారు తలుపు చిత్రాలను ఇటీవలే ఆలయ ట్రస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆలయ తలుపులు భక్తులకు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నట్టు వీటిని డిజైన్ చేయడం జరిగింది.

ఈక్రమంలో అయోధ్య రామాలయానికి మొత్తం 42 బంగారు తలుపులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం రామాలయానికి 46 ద్వారాలు ఉంటాయి. ఆలయంలోని గుడిమెట్ల దగ్గర ఉండే నాలుగు ద్వారాలు మినహాయించి మిగిలిన వాటికన్నింటికీ బంగారు పూత పూశారు. దీని కోసం ఏకంగా వంద కిలోల బంగారాన్ని ఉపయోగించారు.

బంగారు తలుపుల ఫొటోలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయోధ్య బాలరాముడి వైభవం ఎలా ఉండనుందో తెలియజేసే విధంగా ఈ స్వర్ణపు ద్వారాల నిర్మాణం ఉండబోతుంది. ఈ తలుపులు పన్నెండు అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటాయి. వీటిపై రెండు ఏనుగులు భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాయి. బంగారు ద్వారం పైభాగంలో రాజభవనం దానికి అటు ఇటూ ఇద్దరు ద్వారా పాలకులు నిలబడి భక్తులను ఆహ్వానిస్తున్న్టట్లుగా ఉంటాయి.

ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ఇక ఇప్పటికే బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మహత్తర కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే 11వేల మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు అందాయి.

Exit mobile version