Rama Chiluka : ‘రామ చిలుక’ అద్భుతమైన కథల సంపుటి.. హాజరైన పాతూరి, రామినేని
Rama Chiluka : ‘రామ చిలుక’ అద్భుతమైన కథల సంపుటి అని రెండు రాష్ట్రాల గవర్నర్లు అన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఈ సంపుటిలోని కథలను చదివితే జ్ఞానం కలుగుతుందని వివరించారు. శ్రీరామకృష్ణ పరమహంస కథామృతంలోని కథలను చదివిన తాము ఎంతో వివేకవంతులం అయ్యామని గవర్నర్లు అన్నారు. ఇలాంటి పుస్తకాలు వస్తేనే చిన్నారుల భవిష్యత్తు మరింత బంగారంగా మారుతుందని పేర్కొన్నారు.
ఇందులో ఉన్న ప్రతీ కథ అందులోని నీతి సన్మార్గం వైపునకు నడిపిస్తుందన్నారు. ‘రామ చిలుక’ అనే పేరును పెట్టడంపై గవర్నర్లు కీర్తించారు. పరమపావనుడు అయిన శ్రీరాముడి పేరును చిలుక పలుకిందని సీతమ్మ తల్లి ఆ పక్షికి ఆ పేరు పెట్టిందని ఈ సంపుటి కూడా జ్ఞానం, జిజ్ఞాస, తర్కం లాంటివి పెంచుతుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం సబబుగానే ఉందన్నారు.
హైదరాబాద్ లోని గవర్నర్ అధికారిక బంగ్లా (రాజ్ భవన్) లో తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్, గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై సంయుక్తంగా కలిసి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించిన ఎల్ఆర్ స్వామి అనువదించబడిన ‘రామ చిలుక’ అనువాద కథల సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ మీడియా ఇన్ చార్జి, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం, డా. రామినేని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ. రామినేని ధర్మప్రచారక్ ఉన్నారు. కథల సంపుటి ఆవిష్కరణ సందర్భంగా రెండు రాష్ట్రాల గవర్నర్లను శాలువా బొకేతో సత్కరించారు.