Ram Charan : కడప దర్గాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఎప్పుడంటే ?

Ram Charan

Ram Charan

Ram Charan : కడప దర్గాలో ప్రతేడాది ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కడప అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా)లో నవంబర్ 16 నుంచి 21 వరకు పెద్ద ఉర్సు ఉత్సవం జరగనుంది. ఈ వేడుకలకు పీర్ దర్గా పీఠాధిప్ “ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుస్సేనీ” పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఆహ్వానం అందింది. కడప అమీన్ పీర్ దర్గా ముస్లింలకు మక్కా తర్వాత అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం సినిమా ప్రమోషన్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చి కడప దర్గా ఉర్స్ ఉత్సవాలకు వస్తానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కడప దర్గాలో నిర్వహించనున్న 80వ జాతీయ ముషాయిరా గజల్ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ నెల 18వ తేదీ సోమవారం జరిగే ఈ వేడుకకు చరణ్ హాజరుకానున్నారు. రామ్ చరణ్ రాకను దృష్టిలో ఉంచుకుని అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాల దారణలో ఉన్నాడు. దీక్ష చేస్తుండగా వస్తారా.. లేక ఈలోగా దీక్ష విరమిస్తారా అనేది క్లారిటీ లేదు. కడపలోని అమీన్ పీర్ దర్గా చాలా ప్రత్యేకం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, నందమూరి కళ్యాణ్ రామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు కడప దర్గాను గతంలో సందర్శించారు.

TAGS