Sharwanand : రామ్ చరణ్ వల్లే నా జీవితం ఇలా తయారైంది-శర్వానంద్!
Sharwanand : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి , చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, ఆ తర్వాత హీరోగా మారి, విభిన్నమైన స్క్రిప్ట్స్ ని ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకడు శర్వానంద్. శర్వానంద్ అంత చిన్న స్థాయి నుండి హీరో గా ఎదగడానికి అన్నీ కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అతను ఒక కోటీశ్వరుడు,తన తండ్రిని బలంగా అడిగితే మొదటి సినిమాతోనే హీరో అయ్యేవాడు.
కానీ నా తండ్రి సహాయం లేకుండా నేనేంటి, నా రేంజ్ ఏమిటి అని తెలుసుకునే క్రమం లో ఆయన వాళ్ళు సంపాదించిన డబ్బులను ముట్టుకోకుండా, సొంతంగా ఎదిగి చూపించాడు. నేడు ఈ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు శర్వానంద్ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఈ ఫ్లాప్స్ ఆయన ఇమేజి మీద చిన్న మరక కూడా పెట్టలేకపోయాయి, హిట్ వస్తే మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకం నిర్మాతల్లో ఉంది, అందుకే ఇంకా క్రేజీ ప్రాజెక్స్ వస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే శర్వానంద్ కి చిన్నప్పటి నుండి చిరంజీవి ఫ్యామిలీ తో రిలేషన్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చదువుకున్నాడు. ఇద్దరు కలిసి బాగా చిన్నప్పుడు అల్లరి చేసేవాళ్ళు. రీసెంట్ గా శర్వానంద్ ఈటీవీ లో మంచు మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఉస్తాద్’ టాక్ షో కి అతిథిగా విచ్చేశాడు. ఈ కార్యక్రమం లో ఆయన చిరంజీవి, రామ్ చరణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘అవసరం ఉందని తెలుసుకొని మనం అడగకముందే సహాయం చేసేవాడు నిజమైన స్నేహితుడు. నా జీవితం లో రాంచరణ్ అలాంటివాడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం వాడే. నాకు అలాంటి స్నేహితుడిని ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకుకొచ్చాడు.
ఎన్నో ఏళ్ళ స్నేహ బంధం, అలా పెరుగుతూనే పోతుంది, ఎలాంటి గొడవలు లేవు, ఇలాంటి స్నేహితులు మన జీవితాల్లో కూడా ఉంటే ఎంత బాగుండునో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోతే శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.