JAISW News Telugu

Rakul Preet Singh Brother : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ని పెళ్లాడబోతున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు!

Rakul Preet Singh Brother

Rakul Preet Singh Brother

Rakul Preet Singh Brother : కొంతమంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ కూడా ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రలు వేస్తారు. వాళ్ళని మనం ఎప్పటికీ మరచిపోలేము. అలా గుర్తించుకోదగ్గ హీరోయిన్స్ లో ఒకరు సీరత్ కపూర్. ఈమె శర్వానంద్ హీరో గా నటించిన ‘రన్ రాజా రన్’ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకునేలోపు ఇక ఈ అమ్మాయికి టాలీవుడ్ లో తిరుగే లేదని అనుకున్నారు.

అమ్మాయి కూడా అందంగా ఉంది, నటన కూడా బాగుంది కాబట్టి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ కేవలం కొన్ని తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమై మాయమైపోతుంది అని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈమె హీరో గా నటించిన వాటిల్లో ‘రన్ రాజా రన్’ తర్వాత ‘రాజు గారి గది 2 ‘ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియని పరిస్థితి.

కానీ లాక్ డౌన్ సమయం లో ఓటీటీ లో విడుదలైన ‘కృష్ణ & హిస్ లీల’ చిత్రం లో ఒక కీలక పాత్రని పోషించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తుంది. కానీ ఈమెని చూసిన ప్రతీసారి ఇంత అందంగా ఉన్న అమ్మాయి పెద్ద స్థాయికి వెళ్లలేకపోయిందే అనే బాధ ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీళ్లిద్దరు కలిసి పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్ కోసం పని చేశారట.

ఆ సమయం లోనే ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడి, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. న్యూ ఇయర్ రోజు కూడా వీళ్లిద్దరు పార్టీల్లో చేసుకున్న రొమాన్స్ పెద్ద చర్చలకు దారి తీసింది అట. అంటే వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారా?, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అని సోషల్ మీడియా లో గత కొద్దిరోజుల నుండి ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Exit mobile version