Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలతో సైతం నటించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున, గోపి చంద్, జూనియర్ ఎన్టీఆర్, సందీప్ కిషన్, రాం చరణ్ లాంటి హీరోలతో నటించి బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అందుకుంది.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి లవర్ తో బ్రేకప్ చెప్పడానికి కారణం తెలిపింది. తాను చేసే పనులను ఒక్క సారి కించపరిస్తే ఓకే. పదే పదే అవహేళన చేస్తూ చిన్న తనం చూపిస్తే భరించలేకే లవర్ తో బ్రేకప్ చెప్పానని తెలిపింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తన ఆరోగ్యం కోసం చాలా రోజుల పాటు శాఖాహారిగా మారిపోయింది. దాదాపు సంవత్సరం పాటు ఎక్కడా కూడా నాన్ వెజ్ ఐటమ్స్ తినకుండా జాగ్రత్త పడింది.
దీన్నే అలుసుగా తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ ఇష్టారీతిన మాట్లాడటం, చులకన చేసి చూడటం, తాను తినే ఆహారాన్ని చిన్న చూపు చూడటంతో చిర్రెత్తుకొచ్చి బ్రేకప్ చెప్పినట్లు తెలిపింది. లవర్ తో బ్రేకప్ తర్వాత తాను చాలా స్వేచ్చగా జీవించానని పేర్కొంది. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన రీజన్ విని చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఎవరైనా సరే మన భావాలకు, అభిరుచులకు స్వేచ్ఛ ఇవ్వనపుడు కలిసి ఉండలేమని గ్రహించాలని రకుల్ ప్రీత్ సింగ్ ఘటన తెలుపుతోంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకుంటేనే జీవితాలు బాగుంటాయి. రకుల్ తీసుకున్న నిర్ణయాన్నినెటిజన్లు స్వాగతిస్తున్నారు. ఇలాంటి ధైర్యం చేయడం వల్లే మీరు ఉన్నత స్థానానికి చేరుకున్నారని చెబుతూ మెచ్చుకుంటున్నారు. రకుల్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు.