Rakul Preet Singh : పౌరాణిక సినిమాలో లేడీ విలన్ గా రకుల్ ప్రీత్ సింగ్.. ఆశ్చర్యపోతున్న అభిమానులు!
Rakul Preet Singh : సౌత్ ఇండియాలో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. చూస్తూ ఉండగానే ఈమె అనతి కాలం లో పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. కానీ మధ్యలో వచ్చిన కొన్ని డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఈమె కెరీర్ ని చాలా దెబ్బ తీశాయి. టాలీవుడ్ ,కోలీవుడ్ లలో ఈమెకి అవకాశాలు భారీ తగ్గిపోయాయి.
తెలుగు లో ఈమె చివరిసారిగా కనిపించిన చిత్రం ‘కొండపొలం’. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె ఎలాంటి తెలుగు సినిమాలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేసింది. ఒక్కదానికి కూడా మంచి రెస్పాన్స్ రాలేదు కానీ , నటి గా మాత్రం రకుల్ కి మంచి మార్కులే పడ్డాయి.
ఇది ఇలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఒక సంచలనాత్మక పాత్ర చెయ్యడానికి సిద్ధం అయ్యిందట. అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కుతున్న సంగతి మ్మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఖరారు అయిపోయినట్టే అట. ఇందులో రావణుడిగా ప్రముఖ కన్నడ స్టార్ హీరో యాష్ నటిస్తాడని ఒక రూమర్ తెగ ప్రచారం అయ్యింది. మేకర్స్ ఆయనని ఆ పాత్ర కోసం కలిసిన విషయం వాస్తవమే కానీ, నా అభిమానులు నన్ను అలాంటి పాత్రలో చూసేందుకు ఇష్టపడరు, దయహేసి నన్ను క్షమించండి ఈ క్యారక్టర్ నేను చెయ్యలేను అని చెప్పి పంపేసాడట. ఇది కాస్త పక్కన పెడితే ఈ సినిమాలో సూర్పనక్క పాత్ర కి రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగారట.
ఆమె ఆ పాత్ర చేసేందుకు అంగీకారం కూడా తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణం లో సూర్పనక్క ఎవరో మన అందరికీ తెలిసిందే. ఈమె ఒక రావణుడి చెల్లెలు, రాక్షసి కూడా. లక్ష్మణుడిని వరించినందుకు ఆయన ఈమె ముక్కు , చెవులను కోసేస్తాడు. ఆ తర్వాత సూర్పనక్క ఏడుస్తూ వెళ్లి తన అన్నయ్య రావణుడికి చెప్పడం , రావణుడు ఆ తర్వాత సీతని అపహరించి లంక కి తీసుకెళ్లడం ఇవన్నీ మనకి తెలిసిందే. మరి సినిమాలో నెగటివ్ రోల్ అయిన ఈ పాత్ర ని ఒప్పుకొని రకుల్ ప్రీత్ సింగ్ చాలా పెద్ద పొరపాటు చేసిందంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.