Rakhi Sawant : రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు.. నాకు ఇక పిల్లలు పుట్టరు.

Rakhi Sawant

Rakhi Sawant

Rakhi Sawant : బాలీవుడ్ నటి ఎప్పుడూ వార్తల్లో ఉండే ముద్దుగుమ్మ రాఖీ సావంత్ మరో సంచలన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తాను జీవితంలో ఇంకెప్పుడు తల్లిని కాలేనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో రాఖీ సావంత్ అభిమానులు, బాలీవుడ్ ఇండస్ట్రీలో ని వారంతా రాఖీ సావంత్ కు సానుభూతి తెలియజేశారు.

చాలా రోజులుగా రాఖీ సావంత్ అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో హాస్పిటల్ కు వెళ్లగా కడుపులో గర్భాశయం దగ్గర 10 కిలోల కు పైగా కణితి పెరిగిందని డాక్టర్లు చెప్పారని తెలిపింది. ఆ కణితి గనక తీయించుకోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. కానీ ఎప్పటికీ గర్భవతిని కాలేనన్న విషయం మాత్రం మనసుకు ఆందోళన కలిగిస్తూనే ఉంది. అయితే ఈ సర్జరీకి సంబంధించిన ఖర్చు మొత్తం సల్మాన్ ఖాన్ భరించారని చెప్పింది. ఒక వేళ సర్జరీ చేయించుకోకపోతే నేను చనిపోయే దానినని ఆమె చెప్పడంతో సినీ ప్రేక్షకులు ఆమెను ఓదార్చుతున్నారు.

రాఖీ సావంత్ మొదట్లో చాలా సినిమాల్లో నటించింది.  మంచి అవకాశాలు రావడంతో కొన్ని రోజుల  పాటు టాప్ హిరోయిన్ గా కొనసాగింది. ముక్కుసూటి మనస్తత్వంతో ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత మాత్రం ఆమె తన శక్తినంతటినీ ఉపయోగించి తాను గ్లామర్ రోల్స్, ఐటం సాంగ్స్ చేస్తూ సంపాదించింది.

ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న రాఖీ సావంత్ అనారోగ్యం బారిన పడగా.. మొదట గుండె పోటు లక్షణాలు అని చెప్పారు. కానీ తీరా పరీక్లలు చేస్తే గర్భాశయంలో దాదాపు 10 సెంటీ మీటర్ల కణితి ఉందని తేలింది. కణితితో పాటు గర్భాశయం తొలగించకపోతే ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టరని చెప్పడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

TAGS