Rakesh Master : ఏపీ బీరు తాగి రాకేశ్ మాస్టర్ చనిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra
Rakesh Master : దివంగత కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతిపై ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు మద్యం విక్రయించారని ఆరోపించారు. అసెంబ్లీలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
‘‘బూమ్ బూమ్ బీరు తాగి రాకేశ్ మాస్టర్ చనిపోయారు. బీరు తాగే ముందే తేడాగా ఉందని ఆయన చెప్పిన వీడియోలు వైరలయ్యాయి. ఏపీకి వస్తే ఇవి తప్ప ఏం దొరకడం లేదని ఆయన అన్నారు. ఇలాంటి చెప్పుకోలేని ఘటనలు చాలా ఉన్నాయి’’ అని మంత్రి వెల్లడించారు.