Lal Salaam : రజినీకాంత్ ‘లాల్ సలాం’ సినిమా రిలీజ్ కి బ్రేక్..కారణం అదే!
Lal Salaam : జైలర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజినీకాంత్ ‘లాల్ సలాం’ అనే చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. జైలర్ చిత్రం సుమారుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ నుండి సినిమా వస్తుందంటే కచ్చితంగా అంచనాలు వేరే లెవెల్ లో ఉండాలి. కానీ ‘లాల్ సలాం’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
ఒక మీడియం రేంజ్ సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో, అలా ఉంది ఈ సినిమా పరిస్థితి. ఎందుకంటే ఇందులో రజినీకాంత్ హీరో గా చెయ్యలేదు. కేవలం ముఖ్య పాత్ర మాత్రమే పోషించాడు. అంటే ‘బ్రో’, ‘గోపాల గోపాల’ చిత్రాలలో పవన్ కళ్యాణ్ ఎలాంటి రోల్స్ అయితే చేసాడో అలాంటి రోల్ అన్నమాట. ఇందులో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ లు హీరోలు గా నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్యం లో ఈ సినిమా సాగేటట్టుగా ట్రైలర్ ని చూసినప్పుడు అర్థం అయ్యింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కువైట్ లో విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ సినిమా హిందూ, ముస్లిమ్స్ మధ్య జరిగే గొడవ లాగ కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. ఈమధ్య కాలం లో సినిమాల విషయం లో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్న కువైట్ సెన్సార్ బోర్డు ఈ సినిమాని అంగీకరించడం కష్టమే అని అంటున్నారు.
కువైట్ లో రజినీకాంత్ కి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకీ ఈ దేశం లో వచ్చే వసూళ్లు, బాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోస్ కి కూడా రాదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి చోట విడుదల ఉండదు అనే వార్త ఇప్పుడు రజినీ ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తుంది. కుల మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఈ సినిమా ఉంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తెలుగు , తమిళ భాషల్లో కూడా పెద్ద గొడవలు అయ్యేలా ఉన్నాయి. ఏమి జరగబోతుందో తెలియాలంటే ఫిబ్రవరి 9 వరకు ఆగాలి.