Rajinikanth vs Vijay : తమిళనాట రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒక్క తమిళంలోనే కాదు.. ఇండియన్ ఇండస్ట్రీలోనే బిగ్ బీ తర్వాతి ప్లేస్ లో రజనీకాంత్ ఉంటాడు అనడంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అయితే తమిళనాట మాత్రం ఆయనకు సమానంగా విజయ్ కూడా అభిమానులను పెంచుకున్నాడు. ఇప్పుడు తమిళనాట ఈ ఇద్దరు హీరోల మధ్య ‘నువ్వా.. నేనా..? అన్న పోటీ మొదలైనట్లు కనిపిస్తుంది. ఈ రచ్చ కాస్తా సోషల్ మీడియా వరకు పాకింది. దీంతో రజనీ సినిమా విడుదలైనప్పుడు విజయ్ ఫ్యాన్స్, విజయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు రజనీ ఫ్యాన్స్ ఆపోజిట్ హీరోలను తెగ ట్రోల్ చేస్తున్నారు.
దీంతో విజయ్ కూడా విసుగుచెంది రజనీ ఫ్యాన్స్ కు అపోజిట్ గా కామెంట్లు పెడుతుంటాడు. దీంతో ‘జైలర్’ సినిమా వేడుకలో రజనీకాంత్ కూడా విజయ్ ను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్లు చేశాడు. దీంతో మరో సారి రజనీ- విజయ్ మధ్య వార్ మొదలైంది. రీసెంట్ గా.. ‘లాల్ సలామ్’లో విజయ్‌తో పోటీ గురించి రజనీకాంత్ కామెంట్లు చేశాడు. ‘విజయ్ తో నాకు పోటీ లేదు.. విజయ్ నా కళ్ల ముందు పెరిగాడు.
‘ధర్మథిన్ తలైవన్’ షూటింగ్ సమయంలో విజయ్ కి 13 సంవత్సరాలు ఉంటాయి. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని నాతో చెప్పాడు. ముందు స్టడీస్ కంప్లీట్ చేయి.. తర్వాత నటన వైపునకు రా.. అని చెప్పాను. ఆ తర్వాత తనకు ఇష్టమైన రంగంలో కష్టపడి విజయ్ పైస్థాయికి వచ్చాడు. ‘జైలర్’ ఈవెంట్లో నేను చెప్పిన కాకి, డేగ కథను అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారు. విజయ్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. మా ఇద్దరి మధ్యా పోటీ ఉందని అందరూ అంటుంటే వినడం బాధగా ఉంది. అలా చెప్పడం మంచిదికాదు. అందుకే మమ్మల్ని పోల్చవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అంటూ అభిమానులకు హితవు పలికారు.
విజయ్ సినిమా విడుదలైన సమయంలో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నాను. విజయ్ విజయాన్ని ఎప్పుడూ ఆకాంక్షిస్తానని చెప్పుకొచ్చారు రజనీకాంత్. రజనీ స్పీచ్‌తో.. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని తేలిపోయింది. రజనీ అంతటి వాడు.. దిగి వచ్చి, తర్వాతి తరం హీరోని అభినందించడం, తన విజయాన్ని ఆకాంక్షించడం మంచి పరిణామమే. తమిళ నాట ఫ్యాన్స్ వార్ ను కంట్రోల్ చేసేందుకు రజనీ కామెంట్లు ఎంతో కొంత దోహదం చేస్తాయి. ఇకపై కూడా రజనీ కాంత్, విజయ్ అభిమానులు కొట్టుకొంటే అది హీరోల తప్పు కాదు. ముమ్మాటికీ ఫ్యాన్స్ తప్పే అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.