Rajinikanth : జనవరి 26వ తేదీ చెన్నైలో జరిగిన ఐశ్వర్య రజినీకాంత్ చిత్రం ‘లాల్ సలాం’ ఆడియో వేడుకలో రజనీకాంత్ తనదైన శైలిలో హిందూ మతం, సనాతన ధర్మం, భగవద్గీత తదితర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇటీవల ఇళయరాజా కుమార్తె భవతారిణి, కెప్టెన్ విజయకాంత్ మృతికి సంతాపం తెలుపుతూ రజనీకాంత్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జూలై 2023లో జైలర్ కార్యక్రమంలో తన ప్రసంగం చుట్టూ ఉన్న వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. అక్కడ అతను నటుడు విజయ్ ని లక్ష్యంగా చేసుకొని కొందరు నమ్ముతున్న ‘హుకుమ్’ పాట వివాదాస్పద సాహిత్యం గురించి మాట్లాడారు.
ఆ ప్రసంగంలో రజినీ తన అభిప్రాయం వ్యక్తీకరించేందుకు ఒక రూపకాన్ని ఉపయోగించారు, ‘పక్షుల ప్రపంచంలో, కాకి ప్రతి ఒక్కరినీ కలవరపెడుతుంది. అయితే డేగ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకి డేగను ఇబ్బంది పెట్టినప్పుడు, డేగ ప్రతిస్పందించదు’ అన్నారు.
ఈ పోలిక డేగ వంటి ఉన్నతమైన శక్తి కాకి చర్యలతో ఇబ్బంది పడదనే ఆలోచనను తెలియజేసింది. దీంతో తమ ఆరాధ్య దైవంపై రజినీ పరోక్షంగా విరుచుకుపడడంతో కలత చెందిన విజయ్ అభిమానుల నుంచి ట్రోలింగ్ వెల్లువెత్తింది.
తాజాగా లాల్ సలాం కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడుతూ..‘నా క్రో అండ్ ఈగిల్’ చాలా మంది విజయ్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రజలు దీన్ని ఒక పోటీగా చూడడం బాధ కలిగిస్తుంది అన్నారు. మేమిద్దరం మాదైన శైలిలో ప్రత్యేకమైన వాళ్లం అని చెప్పుకున్నాం. చిన్నతనం నుంచి పెద్ద స్టార్ స్థాయికి ఎదిగిన విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి సామాజిక సంక్షేమంలో నిమగ్నమయ్యారు. నేనెప్పుడూ ఆయనకు సపోర్ట్ చేస్తాను. దయచేసి ఇలాంటి అపార్థాలను మళ్లీ తేవద్దు. ఈ విషయాన్ని స్పష్టం చేయాలనుకున్నాను.