Rajinikanth : పేదల సేవలో రజనీ.. ఆయన దారి ఎప్పుడూ రహదారే
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్, స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70ఏండ్ల వయస్సులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు ఆయన. రజనీ సినిమా అంటేనే వందల కోట్ల బిజినెస్. వయసు మీరుతున్న కొద్ది మరింత ఉత్సాహంగా ఆయన పనిచేస్తున్నారు. రాజకీయాల్లోకి ఆయన గతంలోనే వచ్చి ఉంటే కచ్చితంగా ఉన్నత స్థానంలో ఉండేవారు. కానీ ఆయన ఆలస్యం చేయడం..ఇలోగా వయసు మీరడం, అనారోగ్యకారణాలతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు. రాజకీయాల్లోకి రాకున్నా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రజనీ ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలను మరింత చురుగ్గా చేసే యోచనలో ఆయన ఉన్నారని సమాచారం.
ఈనేపథ్యంలో ఇటీవల చెన్నై శివార్లలో రజనీ దాదాపు 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఓ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పించాలన్న ఆశయంతో ఆయన ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సుమారు రూ.200 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారని సమాచారం. త్వరలోనే భూమి పూజ చేయబోతున్నట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చి సేవా చేయాలనుకున్న రజినీ.. బయట ఉండే ఇక సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సూర్య, కార్తి, విశాల్ సైతం ఈ విషయంలో రజనీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. వాళ్లు కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ చేస్తున్నారు.