Rajini and Nani : దక్షిణ భారత సినీ పరిశ్రమలో అందించే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటి సైమా (Siima). అత్యంత ప్రతిష్టాత్మ అవార్డు ప్రధానోత్సవాల్లో ఒకటైన సైమా -2024లో సౌత్ నుంచి తెలుగు, తమిళ చిత్రాలు తమ సత్తా చాటుతున్నాయి. ఈ పురస్కారాలకు పోటీపడుతున్న చిత్రాల జాబితాను సైమా నిర్వాహకులు విడుదల చేశారు. 2023కు గాను తెలుగు నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది. తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ నటించి జైలర్ (తమిళం) చిత్రం కూడా 11 విభాగాల్లో నామినేటై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
జైలర్.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ కమెడియన్‌తోపాటు మరో ఎనిమిది విభాగాల్లో నామినేట్ అయ్యి రికార్డు సృష్టించింది. ఇక మలయాళం నుంచి టోవినో థామస్ నటించిన 2018 చిత్రం, కన్నడం నుంచి టాప్ హీరో దర్శన్ నటించిన కాటేరా 8 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. దుబాయ్‌లో సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో సైమా అవార్డులు ప్రధానం చేయనున్నారు.
నాని దసరా సినిమా 11 విభాగాల్లో పోటీ పడి టాలీవుడ్ కే గర్వకారణంగా నిలిచింది. సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ ఈ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను నిర్ణయిస్తామని, అభిమానులు తమ ఓటును సైమా ఫేస్ బుక్ ద్వారా ఉపయోగించుకోవచ్చని టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది.
నాని దసరా సినిమాకు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను రిలీజ్ చేయగా, నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమాతో నాని తొలిసారి వంద కోట్ల క్లబ్బులో చేరాడు. నాని మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.