Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్..  కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లో ఎవరిది పై చేయి కానుందో..

Rajasthan Royals

Rajasthan Royals

Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ తో శనివారం సాయంత్రం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తలపడనుంది. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 26 సార్లు పోటీ జరగ్గా రాజస్థాన్ రాయల్స్ 15 సార్లు గెలుపొందగా.. పంజాబ్ 11 సార్లు విజయం సాధించింది. పంజాబ్ పై రాజస్థాన్ కు మెరుగైన రికార్డు ఉండటం కలిసొచ్చే అంశం కాగా.. పంజాబ్ కింగ్స్ అతిథ్యమిస్తున్న ముల్హనూరు లోని మహారాజా యదవీంద్ర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనుంది.

పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ తో మంచి పర్ఫామెన్స్ చూపించినా చివరి ఓవర్లో 29 పరుగులు చేజ్ చేయలేక తడబడి ఓటమి పాలైంది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇద్దరు కలిసి సన్ రైజర్స్ బౌలర్ పై విరుచుకుపడి సిక్సులు బాదినా.. రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లతో ఫామ్ అందుకోవడం, బ్యాటింగ్ లో శశాంక్ సింగ్ ఫామ్ లో ఉండడం సానుకూల అంశాలు కాగా.. ఓపెనర్ జానీ బెయిర్ స్టో, శిఖర్ దావన్ లు ఫామ్ లోకి వస్తేనే పంజాబ్ కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. మిడిల్ ఆర్డర్ లో సామ్ కరన్, సికిందర్ రాజా నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేయగా.. సంజు శాంసన్ టీమే పంజాబ్ తో మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలో దిగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో నాలుగింట్లో గెలిచి గుజరాత్ పై చివరి బంతికి ఓటమి చవి చూసింది. రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. బట్లర్ కూడా పూర్తి స్థాయి ఫామ్ ను అందుకోలేక పోతున్నాడు. మిడిలార్డర్ లో సంజు శాంసన్, రియాన్ పరాగ్ మాత్రం దంచికొడుతున్నారు.

రియాన్ పరాగ్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలో ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ ను సరిగా వినియోగించుకోకపోవడంతో గుజరాత్ తో మ్యాచ్ లో ఆర్ ఆర్ ఓటమికి కారణమని అభిమానులు విమర్శిస్తున్నారు. అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, బౌల్ట్, యుజ్వేంద్ర చాహాల్ తో బౌలింగ్ లో బలంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఐపీఎల్ 27 వ మ్యాచ్ లో రాజస్థాన్ ఫేవరేట్ గా దిగుతున్నా పంజాబ్ కింగ్స్ ను తక్కువ అంచనా వేయలేం.