RR Vs RCB : రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్ లో ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు రెండు జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. రాజస్థాన్ ఫస్ట్ తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిది గెలిచి పాయింట్స్ టేబుల్స్ లో మొదటి స్థానంలో ఉండగా.. వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయి చివరి మ్యాచ్ డ్రా కావడంతో తప్పక ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తోంది.
రాజస్థాన్ టీంలో బట్లర్ ఇంగ్లాండ్ వెనుదిరిగి వెళ్లిపోగా.. యశస్వి జైశ్వాల్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. బ్యాటింగ్ భారం మొత్తం సంజు శాంసన్, రియాన్ పరాగ్ మీదనే పడుతోంది. బౌలింగ్ లో యుజ్వేంద్ర చాహాల్ కూడా వికెట్లు తీయలేకపోతున్నాడు. బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ లు తమ స్థాయికి మించి ప్రదర్శన చేస్తేనే విరాట్ కొహ్లి, డుప్లెసిస్ ను అడ్డుకోగలరు. లేకపోతే ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచులు గెలిచిన ఆర్సీబీని ఓడించాలంటే శక్తికి మించి ప్రదర్శన చేయాల్సిందే.
ఆర్సీబీ టీంలో విరాట్ కొహ్లి, డుప్లెసిస్ బ్యాటింగ్ లో ఫామ్ లోకి వచ్చారు. కానీ బౌలింగ్ విభాగంలో సిరాజ్ నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. స్వప్నిల్ సింగ్ స్పిన్ బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్ లో గ్రీన్, మ్యాక్స్ వేల్ ఫామ్ లోకి రావడంతో ఈ మ్యాచ్ పై అంచనాలు పెరిగిపోయాయి.
అహ్మదాబాద్ లో మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోగా.. కోల్ కతా ఫైనల్ చేరుకుంది. ఆర్సీబీ, రాజస్థాన్ జట్లలో ఏ జట్టు ఓడిపోతుందో అది ఇంటి బాట పట్టనుండగా.. గెలిచిన టీం క్వాలిఫైయర్ లో ఓడిపోయిన సన్ రైజర్స్ తో ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ తో ఎవరూ పోటీలో ఉంటారో ఆర్సీబీ, రాజస్థాన్ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఫామ్ ను బట్టి చూస్తే ఆర్సీబీ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.