RR Vs MI : రాజస్థాన్ రాయల్స్.. ముంబయి ఇండియన్స్ కీలక మ్యాచ్.. హర్దిక్ పుంజుకునేనా?

RR Vs MI

RR Vs MI

RR Vs MI : రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ సోమవారం సాయంత్రం సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సూపర్ ఫామ్ లోఉన్న రాజస్థాన్ రాయల్స్ ఏడు మ్యాచ్ లకు ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ముంబయి 7 మ్యాచులకు మూడు గెలిచి 7 స్థానంలో ఉంది.

రెండు జట్లు ఇప్పటి వరకు 28 సార్లు తలపడగా.. రాజస్థాన్ 13 సార్లు, ముంబయి 15 సార్లు గెలిచి ఆధిపత్యంలో ఉంది. ముంబయి ఇండియన్స్ తరఫున ఇషాన్ కిషన్ రాణించలేకపోతున్నాడు. రోహిత్ ఫామ్ లో ఉన్నా ఫాస్ట్ గా ఆడటం లేదు. సూర్య, టిమ్ డేవిడ్ పూర్తి స్థాయి ఆటతీరు కనబర్చడం లేదు. దీనికి తోడు హర్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ లో తేలిపోతున్నాడు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా రాణించాలని, బౌలింగ్ లో బుమ్రా కాకుండా మిగతా వారు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తేనే రాజస్థాన్ పై విజయం సాధ్యమవుతుందని టీం అనుకుంటోంది.

ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే యశస్వి జైశ్వాల్ పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. బట్లర్ ఇప్పటికే రెండు సెంచరీలతో టీంకు అద్భుతమైన విజయాలు అందించాడు. యశస్వి జైశ్వాల్ మాత్రం ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. చాహల్ సూపర్ బౌలింగ్ తో పర్ఫుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇప్పటికే 12 వికెట్లు తీసి ఈ సీజన్ లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్  గా  రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

రాజస్థాన్ టీంను గాయాల బెడద ఇబ్బంది పెడుతున్నాయి. నండ్రే బర్గర్, సందీప్ శర్మ పక్కటెముల గాయంతో డగౌట్ కే పరిమితమయ్యారు. సందీప్ శర్మ వేగంగా కోలుకుంటున్నాడని టీం డైరెక్టర్ కోచ్ కుమార సంగక్కర తెలిపాడు. ఈసారి ఎలాగైన ఐపీఎల్ టైటిట్ సాధించాలని రాజస్థాన్ రాయల్స్ టీం భావిస్తోంది.  సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో స్పిన్నర్లు లీడింగ్ వికెట్ టేకర్లుగా ఉన్నారు.  ముంబయి నుంచి శ్రేయస్ గోపాల్ 15 వికెట్లు తీసుకుని ముందంజలో ఉండగా.. చాహల్ 14  వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

TAGS