RR Vs SRH : ఫైనల్ పోరుకు రాజస్థాన్, సన్ రైజర్స్ సిద్ధం

RR Vs SRH

RR Vs SRH

RR Vs SRH : క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్ రైజర్స్, ఎలిమినేటర్ వన్ మ్యాచ్ లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ చెన్నై లోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో తప్పక విజయం సాధించాలని సన్ రైజర్స్ కోరుకుంటోంది. 2016 తర్వాత సన్ రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. రాజస్థాన్ రాయల్స్ 2008 లో ఒక్కసారి మాత్రమే టైటిల్ విన్ అయింది. దీంతో ఇరు జట్లు కచ్చితంగా ఈ సారి టైటిట్ రేసులో ఉండాలని నిర్ణయించుకున్నాయి.

ఇప్పటికే కోల్ కతా చేతిలో ఓడిపోయిన ఎలిమినేటర్ 2 మ్యాచ్ ఆడాల్సి రావడంతో సన్ రైజర్స్ బ్యాటర్లు కసి మీద ఉన్నారు. ట్రావిస్ హెడ్ గత రెండు మ్యాచుల్లో డకౌట్లు కావడం ఆందోళన కలిగిస్తోంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో పామ్ కోల్పోయాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో ఇంకా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. నటరాజన్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో మొదటి  9 మ్యాచుల్లో ఎనిమిది గెలిచి పాయింట్స్ టేబుల్స్ ఫస్ట్ స్థానంలో ఉండేది. కానీ ఆ తర్వాత వరుస ఓటములతో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీని మట్టికరిపించి ఎలిమినేటర్ 2కు అర్హత సాధించింది. దీంతో ఈ సీజన్ లో భారీ స్కోర్లు చేస్తున్న సన్ రైజర్స్ ను అడ్డుకుని గెలిస్తేనే ఫైనల్ బెర్త్ ఖరారు కానుంది.

రాజస్థాన్ రాయల్స్ లో యశస్విజైశ్వాల్ ఫామ్ లోకి రావడం ఆనందం కలిగించే విషయం. యశస్వి జైశ్వాల్ 45 పరుగులతో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇందులో 8 ఫోర్లు బాదడం విశేషం. సిమ్రాన్ హిట్ మయర్, కడ్ మోర్, రియాన్ పరాగ్, రావ్ మెన్ పావెల్ సమయోచితంగా ఆడి ఆర్సీబీకి విజయం సాధించాడు.

TAGS