
MLA Raja Singh
MLA Raja Singh : ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని హౌజ్ అరెస్టు చేశారు. ఇటీల మెదక్ లో జరిగిన ఘర్షణల్లో గాయపడ్డవారిని పరామర్శించేందుకు వెళ్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని రాజాసింగ్ మెదక్ వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ముంబై నుంచి హైదరాబాద్ కు రాజాసింగ్ వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే పోలీసులు ఎస్కార్ట్ ద్వారా ముందుగా గోషామహల్ లోని ఆయన ఇంటికి తరలించారు. అనంతరం మెదక్ అల్లర్లలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మియాపూర్ లోని ఆస్పత్రికి వెళ్లి ఆయన పరామర్శించారు.