Rajamouli : ఆ డైరెక్టర్ ను చూసి నేర్చుకో అంటూ రాజమౌళికి భార్య వార్నింగ్..

Rajamouli

Rajamouli

Rajamouli :  ప్రస్తుతం పాన్ ఇండియాలోనే నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఒక సినిమాను మించి మరో సినిమాతో సూపర్ హిట్లు కొడుతున్నాడు. ఇప్పటి దాకా అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ కెరీర్ తొలినాళ్లలో తన తోటి డైరెక్టర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నాడు.

ఇందులో వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్, సుకుమార్ ఉన్నారు. మాస్ డైరెక్టర్ గా  వీవీ వినాయక్ మంచి పేరు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణతో తీసిన సినిమాలు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశాయి. బాలకృష్ణతో చేసిన చెన్నకేశవరెడ్డి సినిమా అనుకున్నంతగా ఆడకపోలేదు. కానీ ఇటీవల బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో చెన్నకేశవరెడ్డిగా బాలకృష్ణ మేకోవర్, డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక సుకుమార్ కూడా క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో దూసుకుపోతున్నాడు. మధ్యలో ప్లాఫ్ వచ్చినా పుష్ప సినిమాతో మళ్లీ తన సత్తా చాటాడు. వీరందరూ ఒకెత్తయితే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో ఎత్తు.

తొలి సినిమా బద్రీతోనే సెన్షేనల్ హిట్టు కొట్టాడు. అంతగా పేరు లేని సమయంలో రవితేజను పెట్టి హీరోగా పెట్టి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. అదే సమయలో స్టూడెంట్ నంబర్ తో హిట్ కొట్టిన రాజమౌళికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు పూరీ జగన్నాథ్.  రాజమౌళిని మించిన హిట్లు కొట్టాడు. పోకిరీ సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీకి మూడేళ్లు పట్టింది. అది కూడా రాజమౌళి తీసిన మగధీర కావడం విశేషం. ఇలా  పోటీపడుతూ సినిమాలు చేస్తూ వస్తున్నారు.  ఇక రాజమౌళి  సినిమాలు ఏళ్ల పాటు షూటింగ్ సాగుతున్న విషయం తెలిసిందే. ఒక్కో సినిమా కంప్లీట్ చేయడానికి కనీసం రెండేళ్లు తీసుకుంటున్నాడు రాజమౌళి.  అయితే ఇదే విషయమై రాజమౌళి భార్య వార్నింగ్ ఇచ్చిందట. ఏళ్ల పాటు సినిమా షూటింగ్ చేయడం కాదు.. పూరీ జగన్నాథ్ ను చూసి నేర్చుకో అందట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా బిజినెస్ మెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కనీసం ఒక్క రోజైనా తనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశమివ్వమని అడిగాడు రాజమౌళి. ఇలా ఒక టాప్ డైరెక్టర్ మరో టాప్ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేయడం తెలుగు ఇండస్ర్టీలోనే తొలిసారి.

ఇక రాజమౌళి తండ్రి విజయంద్రప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించాడు. కానీ తనకు పూరీ జగన్ అంటే ఎంతో అసూయ అని, అతనిలా సీన్లు క్రియేట్ చేయడం రాదని పలు ఇంటర్వ్యూలలో స్వయంగా చెప్పాడు. ఈ వీడియోలు నెట్టింట ఇప్పటికీ చక్కర్లు కొడుతుండడం విశేషం.

TAGS