JAISW News Telugu

Guntur Kaaram : గుంటూరు కారం డిజాస్టర్ తో రాజమౌళికి లింక్? అందేంటంటే?

Guntur Kaaram

Guntur Kaaram, Rajamouli-Mahesh

Guntur Kaaram : రాజమౌళి గురించి బహూషా దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేదు కావచ్చు. ఆయన కెరీర్ లో ఒక సినిమాకు మించి మరో సినిమా సక్సెస్ అవుతూవచ్చింది. బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తే.. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆస్కార్ తెచ్చి పెట్టింది. ఇవన్నీ తెలిసనవే.. ఇవన్నీ పక్కన ఉంచితే మహేశ్ బాబు సినిమా గుంటూరు కారం డిజాస్టర్ కు రాజమౌళికి ఉన్న లింకు ఏంటంటారా? ఇక్కడ చూద్దాం…

రాజమౌళి సినిమా సక్సెస్ కు కొన్ని సెంటిమెంట్లు బాగా వర్కవుట్ అవుతూ వస్తు్న్నాయి. ఆయన సినిమాలో చేసిన హీరో తర్వాతి సినిమా డిజాస్టర్ గా మారుతుంది. అయితే ఆర్ఆర్ఆర్ లో చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చేస్తున్నాడు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో డిజాస్టర్ కావద్దని చాలా శ్రమిస్తున్నారు. అయితే ఈ గండం నుంచి ఆయన గట్టెక్కే ఛాన్స్ ఒక వైపునుంచి కనిపిస్తుంది. అది చరణ్ రూపంలో..

జక్కన్న సినిమాకు తర్వాతే కాదు.. సినిమా ముందు కూడా.. సదరు హీరో సినిమా డిజాస్టర్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ కు ముందు ఎన్టీఆర్ అరవింద సమేత చేశాడు. కానీ అది బాక్సాఫీస్ హిట్ అయ్యింది. కానీ అదే సమయంలో చరణ్ వినయ విధేయ రామ చేశాడు. ఇది 2019 సంక్రాంతికి రిలీజ్ కాగా.. భారీ డిజాస్టర్ కు గురైంది.

ఇక ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను మహేశ్ బాబు కొనసాగిస్తున్నారు. రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్ట్ మహేశ్ బాబుతో అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు ముందు ఆయన త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న గుంటూరు కారం రిలీజ్ చేయాలని అనుకున్నారు. అది కాస్తా ఈ జనవరి 12న జరిగింది. రిలీజ్ రోజు మార్నింగ్ షో ఫస్ట్ ఆఫ్ నుంచే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే గుంటూరు కారంకు కేటాయించిన కొన్ని థియేటర్లను హను-మాన్ కు కేటాయించాలని దిల్ రాజు కూడా అనుకున్నాడట.

ఇక అసలు విషయానికి వస్తే చరణ్ వినయ విధేయ రామ, మహేశ్ గుంటూరు కారం రెండు కూడా సంక్రాంతి కానుకలుగానే వచ్చాయి. ఎన్టీఆర్ కూడా గతంలో సింహాద్రి సినిమా ముందు నాగతో ఫ్లాప్ ఇచ్చాడు. సై హిట్ కు ముందు నితిన్ శ్రీఆంజనేయంతో డిజాస్టర్ ఇచ్చారు. ఛత్రపతి ముందు కూడా ప్రభాస్ చక్రంతో పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా రాజమౌళితో సినిమాకు ముందు సదరు హీరో భారీ ఫ్లాప్ ను ఎదుర్కొవడం యాధృచ్ఛికమే అయినా.. జక్కన్నకు కలిసి వస్తుంది.

Exit mobile version