SS Rajamouli-David Warner : రాజమౌళికి పిచ్చెక్కించిన క్రికెటర్ వార్నర్.. (వీడియో)

SS Rajamouli-David Warner
SS Rajamouli-David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు ఇండియా ఏం ప్రత్యేకం కాదు.. ఇక్కడ కూడా విపరీతంగా ఫ్యాలోవర్స్ ను కలిగి ఉన్నారు డేవిడ్ వర్నర్. క్రికెట్ లోనే కాకుండా రీల్స్, షాట్స్ లతో కరోనా టైంలో నెటిజన్లకు దగ్గరయ్యాడు డేవిడ్ వర్నర్.
ఐపీఎల్ లో గతంలో సన్ రైజర్స్ టీంలో ఆడిన ఆయన హైదరాబాదీలకు బ్రదర్ అయిపోయాడు. వార్నర్ యాక్టర్‌గా మారాడు. Cred UPI యాప్ కు సంబంధించి యాడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి నటించాడు.
ఈ యాడ్ ఎలా ఉందంటే? జక్కన్నకు కాల్ చేసి మ్యాచ్ టికెట్ కావాలని అడుగుతాడు. అది కావాలంటే తనకు సినిమా ఛాన్స్ ఇవ్వాలని కోరుతాడు. ‘ఆర్ఆర్ఆర్’, ‘మగధీర’ సినిమా గెట్ అప్స్లో కనిపించిన ఆయన.. దారుణంగా నటించి జక్కన్ననే తెగ ఇరిటేట్ చేస్తాడు.
దీంతో Cred UPI కి అప్ గ్రేడ్ అవుతున్నట్లు రాజమౌళి చెప్పడంతో యాడ్ అయిపోతుంది. అసలు ఈ యాడ్ లో ఏం చెప్పారంటే నార్మల్ UPI వాడితే డేవిడ్ వార్నర్ యాక్టింగ్‌లా.. Cred UPI వాడితే అసలు హీరోల్లా ఉంటుందనేది మీనింగ్. నెటిజన్స్ ఈ యాడ్‌కు ఫిదా అయ్యారు. రాజమౌళి ప్రాజెక్టులో వార్నర్‌ను చూడాలని ఉందని అంటున్నారు.
జక్కన్నతో డేవిడ్ వార్నర్ యాడ్ లో కనిపించడంతో ఇరు వైపులా ఫ్యాన్స్ సంబురపడి పోతున్నారు. అస్సలు ఊహించలేని కాంబో అంటూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్ స్టాలో వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram