Rajamouli Documentary : నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళి డాక్యుమెంటరీ.. ఒరిజినల్ వాయిస్ లేకపోవడంపై తెలుగు ఫ్యాన్స్ అసంతృప్తి
Rajamouli Documentary : కెరియర్ లో ఇప్పటి వరకు ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని టక్కున చెప్పేస్తారు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా జక్కన్న ఆర్ఆర్ఆర్ వరకు అన్ని విజయాలే సాధించారు. చివరకు ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ అవార్డును కూడా తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. తెలుగులో మగధీర సినిమా తో టాలీవుడ్ సినిమాల రేంజ్ ను ప్రపంచ వ్యాప్తం చేశాడు. ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.
బాహుబలి 1, ఆర్ఆర్ఆర్ మూవీలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. హాలీవుడ్ మేకర్స్ సైతం రాజమౌళి డైరెక్షన్ ను మెచ్చుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో ఖండాంతారాలు దాటి ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళి మేకింగ్ ఆయన సినిమా తీసే విధానంపై ఒక డాక్యుమెంటరీ ని తీశారు. సీనియర్ జర్నలిస్టు అనుపమ చోప్రా మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని రాజమౌళి విశేషాలతో రూపొందించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం అస్సలు బాగోలేదని కామెంట్స్ వస్తున్నాయి.
ఒక తెలుగు డైరెక్టర్ గురించి మన హిరోలు చెబుతుంటే ఒరిజినల్ వాయిస్ కాకుండా డబ్బింగ్ చెప్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలుగుకు సంబంధించి ఒరిజినల్ వాయిస్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తన సొంత గొంతుతో అభిప్రాయాలు చెబుతుంటే తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. లేకపోతే ఒక ఎమోషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి తెలుగు ప్రేక్షకుల కోసం నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ లో ఒరిజనల్ వాయిస్ పెడతారో లేదో చూడాలి