Rajamouli Dance : ప్రభుదేవా పాటకు రాజమౌళి దంపతుల అద్దిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..

Rajamouli Dance
Rajamouli Dance : భారతీయ సినిమాను ప్రపంచం నలుమూలల పరిచయం చేసిన దర్శక ధీరుడు.. వెయ్యి కోట్ల సినిమాలను అలవోక తీస్తూ హాలీవుడ్ కే పాఠాలు చెప్తున్న తెలుగు సినిమా జక్కన్న.. జేమ్స్ కామెరూన్ వంటి వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ చేత కితాబు అందుకున్న సినిమా మాంత్రికుడు మన రాజమౌళి. హీరోల భవిష్యత్ ను మారుస్తూ వెయ్యి హీరోలకు బలమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు జక్కన్న. తెలుగు సినిమాకే భారతీయ సినిమాలకు మగధీర, బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలను అందించారు. రాజమౌళి ఏ హీరోతో సినిమా తీస్తే ఆ హీరో రాత మారిపోతుంది. టాలీవుడ్ హీరో కాస్త పాన్ ఇండియన్ స్టార్ అయిపోతాడు. అందుకే ప్రతీ నటుడు రాజమౌళి సినిమాలో ఒక్క సీన్ లోనైనా కనపడాలని కోరుకుంటాడు. ఆయన సినిమాకున్న పవర్ అలాంటింది.
రాజమౌళి వంటి గొప్ప దర్శకుడు వాస్తవానికి ఎంతో గంభీరంగా, అహంకారపూరితంగా ఉంటారని అనుకుంటారు. కానీ మన రాజమౌళి ఎంతో జోవియల్ గా, అసలు ఓ మాములు కొత్త దర్శకుడిలాగా ప్రవర్తిస్తుంటారు. హీరోలకు సోదరుడిలా నవ్వుతూ, నవ్విస్తూ వారితో కలిసిపోతూ అందరికీ తమ ఇంటి వ్యక్తిగా ఉంటాడు. ఆయనతో సినిమా చేసిన హీరో ఆయన్ను ఎన్నడూ మరిచిపోలేరు.
వర్క్ విషయంలో ఎంతో సీరియస్ గా ఉండే రాజమౌళి పర్సనల్ లైఫ్ లో ఎంతో సరదాగా ఉంటారని ఇంతకుముందే చెప్పుకున్నాం. కుటుంబంతో కలిసి ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తారు. తాజాగా ప్రభుదేవా పాటకు తన సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రేమికుడులోని ‘‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..’’ పాటకు స్టేజ్ పై డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘వావ్.. సూపర్ గా డ్యాన్స్ చేశారు..’’ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబుకు ఈ సినిమా 29వది. యాక్షన్ అడ్వెంచర్ గా సిద్ధం కానుంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ భాగం కానున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.
Director @SSRajamouli and his wife groove to the beats of Beautiful melody pic.twitter.com/ib5RjAQVxy
— Suresh PRO (@SureshPRO_) March 31, 2024