Raja Vasireddy Idol Ceremony : నాగార్జునసాగర్ ఆనకట్ట ప్రదాత & ముక్త్యాల రాజా గారి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. జగ్గయ్యపేట పట్టణం పద్మావతి నగర్ లో రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్(ముక్త్యాల రాజా) గారి విగ్రహావిష్కరణ మహోత్సవంలో వీఎల్ ఇందిరాదత్తు గారితో కలిసి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ ,టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ప్రపంచంలో మానవ శక్తితో నిర్మితమైన అతి పెద్ద బహుళార్థక సాధక నాగర్జున సాగర్ ఆనకట్ట ప్రధాత. ఈ ఆనకట్ట కోసం 1952వ సంవత్సరంలో 52 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన దానశీలి అన్నారు. పాడి రైతుల శ్రేయస్సుకై వ్యవస్థీకృత పాడి పరిశ్రమ నెలకొల్పుటకు చిల్లకల్లులో పాల శీతలికరణ కేంద్ర నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చిన వితరణ శీలి అన్నారు. కృష్ణ మిల్క్ యూనియన్ ఆవిర్భావానికి ముఖ్య ధార్శనికులు అన్నారు. ఆయుర్వేద విజ్ఞానంతో ఆ ప్రాంత వాసులకు ఆయుష్షును పెంచి ఆయుర్వేదాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రదాత అన్నారు. అనేక గ్రామాలలో విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారులు నిర్మించి నిరంతరం ప్రజా సంక్షేమానికి, సమాజ అభివృద్ధికి కృషిచేసిన అభ్యుదయ వాది అన్నారు.
చిల్లకల్లు సమితికి ప్రధమ అధ్యక్షులు హరిజనోదరణకై పాటుపడిన మానవతావాది అని వక్తలు కొనియాడారు. సాహిత్య పోషకులు, కళారాధకులు ఆధ్యాత్మిక చింతనాపరలు పరోపకారా పరాయణులు. సమితి అధ్యక్షు హోదాలో ప్రతి గ్రామములో పాఠశాల నెలకొల్పి విద్యావ్యాప్తికి దోహదపడ్డారని వారి సేవలను కొనియాడారు.