Raj Tarun : తెలుగు హిరో రాజ్ తరుణ్ పై ఆయన ప్రియురాలు కేసు వేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ మూవీ ప్రస్తుతం తిరగబడరా సామి ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య తనను రాజ్ తరుణ్ మోసం చేశాడని 11 ఏండ్లుగా అతడితో రిలేషన్ షిప్ లో ఉన్నానని తనకు న్యాయం చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు వేసిన విషయం తెలిసిందే.
దీనిపై చాలా మంది ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజ్ తరుణ్ సినిమా ప్రమోషన్ల భాగంగానే ఇలా చేశాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరగబడారా స్వామి హిరోయిన్ మాల్వీ మాల్హొత్ర తో ప్రేమాయణం సాగిస్తున్న రాజ్ తరుణ్ తనను అన్ని రకాలుగా వాడుకుని మోసం చేశాడని లావణ్య వాపోయింది. అయితే ఆమెతో రిలేషన్ షిప్ తో ఉన్న విషయం నిజమే. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు విడిపోయాం. ఆమె కేవలం డబ్బుల కోసమే ఇలా చేస్తుందని నిర్మోహమాటంగా చెప్పాడు.
రాజ్ తరుణ్ విషయంలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయం గనక ఫ్రాంక్ అయితే మాత్రం నీ ఇజ్జత్ మొత్తం పోయినట్లే. నీ మీద ఉన్న కాస్త గౌరవం కూడా పోయినట్లే అని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య సినిమా ప్రమోషన్ల కోసం చాలా మంది సెలబ్రేటీలు పోలీసుల కేసులు ఇలా అనేక విషయాల గురించి ఫ్రాంక్ లు చేస్తున్నారు.
నివేథా హేతురాజ్ కూడా పరువు వెబ్ సిరీస్ సమయంలో ఇలానే ప్రవర్తించింది. పోలీసులతో దురుసుగా మాట్లాడినట్లు వీడియో వైరల్ అయింది. తర్వాత అది కాస్త ఫ్రాంక్ వీడియో.. కేవలం సినిమా ప్రమోషన్ కోసం అని తేలడంతో అందరూ ఆమెను తిట్టిపోశారు. అయితే రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ కూడా కేసు వేసిన తర్వాత కనిపించకుండా పోవడం, రాజ్ తరుణ్ మేం రిలేషన్షిప్ లో ఉన్నది నిజమే అని చెప్పడంతో ఇదంతా ఏదో తేడా కొడుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది గనక స్టంట్ అయితే రాజ్ తరుణ్ ను జీవితంలో తెలుగు ప్రేక్షకుడు ఎవరూ నమ్మరని చెబుతున్నారు.