Raj Tarun : రాజ్ తరుణ్ ట్రాయంగిల్ ప్రేమకథ.. ఆ ముగ్గురి మధ్య అసలేం జరిగింది?

Raj Tarun

Raj Tarun

Raj Tarun : హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని నార్సింగ్ పోలీసులను లావణ్య అనే అమ్మాయి ఆశ్రయించింది. ఈ కేసులో ఏం జరిగిందన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ లవర్ గా చెప్పుకుంటున్న లావణ్య ‘తిరగబడరా సామి’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన మాల్వీ మల్హోత్రాపై ఆరోపణలు చేస్తోంది.

తనను పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ మాటిచ్చాడని ప్రస్తుతం మాల్వీ మల్హోత్రా వల్లే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. ఇదిలా ఉంటే అసలు మాల్వీ మల్హోత్రా ఎవరు? ఆమెకు రాజ్ తరుణ్ కు సంబంధం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.

మాల్వీ మల్హోత్రా హిమాచల్ ప్రదేశ్ పుట్టి, ముంబైలో అభ్యసించింది. మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న ఆమెకు 2017లో హిందీ మూవీ (ఉడాన్)లో ఛాన్స్ దొరికింది. ఇది చేసిన తర్వాత టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ ఆమె నటన చూసిన దర్శక, నిర్మాతలు హిందీలోనే ఆమెకు ‘హోటల్ మిలన్’లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాలు చేసింది.

అవి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇక అక్కడ అనుకున్న ఆఫర్స్ రాకపోవడంతో మలయాళంలో ‘అభ్యూహం’ అనే మూవీలో చేసింది. ఆ సినిమాతో కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కకపోవడంతో ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్న ‘తిరగబడరా సామి’లో సెలెక్ట్ అయింది. ఇదే ఆమెకు మొదటి తెలుగు సినిమా. ఆ సినిమాలో హీరోగా చేస్తున్న రాజ్ తరుణ్ కు ఆమెకు పరిచయం ఏర్పడి, అది స్నేహం వరకు వెళ్లింది.

అప్పటి నుంచి వీరు లివ్ ఇన్ లో ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. అంతకు ముందే లావణ్య అనే అమ్మాయితో లవ్ ట్రాక్ నడిపిన రాజ్ తరుణ్ వివాహం కూడా చేసుకుంటానని మాట ఇచ్చినట్లు ఆమె చెప్తోంది. మాల్వీ మల్హోత్రా తో లివ్ ఇన్ లో కొనసాగుతుండడంతో తనను పట్టించుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ కూడా లావణ్యతో 2017కు ముందు లివ్ ఇన్ లో ఉన్నట్లు చెప్పాడు. కానీ ఆమె వైఖరి నచ్చకపోవడంతో వదిలేసినట్టు చెబుతున్నాడు. ఇందులో మున్ముందు ఏం జరుగుతుందన్నది తెలియాల్సి ఉంది. 

TAGS