Raj Tarun : రాజ్ తరుణ్.. లావణ్య.. మధ్యలో ఇరుక్కుపోయిన మాల్వీ
Raj Tarun: యువ హీరో రాజ్‌తరుణ్ కేసులో రోజుకో కొత్త విషయం బయటికి వస్తున్నది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని, హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తున్నదని లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే తన సోదరుడికి మెసేజుల పంపుతున్నదంటూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కూడా లావణ్యపై ఫిర్యాదు చేశారు. ఇలా పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఈ కేసులో పోలీసులు రాజ్‌తరుణ్ ఏ1గా చేర్చుతూ పోలీసులు ఎఫ్ఐ ఆర్ నమోదు చేశఆరు. కాగా ఏ2గా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాను చేర్చిన పోలీసులు ఏ3గా మయాంక్ మల్హోత్రాను కూడా ఎఫ్ ఐఆర్ లో చేర్చారు. 420, 493, 506 సెక్షన్ల కింద రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తన ఫిర్యాదులో లావణ్య పలు విషయాలను పేర్కొంది.
రాజ్‌తరుణ్ పరిచయం నుంచి మొదలు ఇప్పటి దాకా ఏం జరిగిందో అన్ని విషయాలు వివరించింది. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉందని లావణ్య తన ఫిర్యాదు లో పేర్కొంది. 2010లో రాజ్‌తరుణ్ తనుకు ప్రపోజ్ చేశాడని, 2014లో పెళ్లి చేసుకున్నాడని చెబతున్న విషయం తెలిసిందే. అలాగే రాజ్‌తరుణ్‌కు తాను గతంలో రూ. 70 లక్షలు ఇచ్చానని కూడా చెబుతున్నది.
రాజ్‌తరుణ్ వల్ల 2016లో తాను గర్భవతిని అయ్యానని, కానీ రెండో నెలలోనే అబార్షన్ చేయించాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌తరుణ్, మాల్వీ ఇద్దరూ కలిసి తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న లావణ్య హీరోయిన్ మాల్వీ, ఆమె సోదరుడిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో కోరింది.