Rains in Telangana : తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేశారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు చెప్పారు. రేపటికి తూర్పు వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీన ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.