Telangana Rains : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ సహా చాలా దక్షిణ ప్రాంతాల్లో జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షం కురుస్తుందని సూచించారు.
ఈరోజు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నైరుతి రుతుపవనాలు అనుకున్న తేదీ కన్నా ముందే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జూన్ 5 నుంచి 11 తేదీల మధ్య రాష్ట్రంలో విస్తరించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.