AP Rains : ఏపీలో ఈదురుగాలులతో పాటు వర్షాలు..
AP Rains : ఆంధ్రప్రదేశ్ లో వచ్చే రెండు, మూడు రోజులు ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అంతర్భాగ కర్నాటక పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం, ఆగ్నేయ ఆరేబియా సముద్రం ఆనుకున్న ఉన్న కేరళ నుంచి కర్నాటక మీదుగా మరఠ్వాడా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనమైందని తెలిపింది. దీంతో నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.
రానున్న 4, 5 రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం కూడ ఉంది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.