JAISW News Telugu

Rain Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

FacebookXLinkedinWhatsapp
Rain Alert

Rain Alert

Rain Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. వడగళ్ల వానకు పలు జిల్లాల్లో జొన్న, వేరుశనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొట్టుకుపోయింది. అలాగే హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతలం అయింది. దీంతో రాష్టంలో వాతావరణం చల్లబడినప్పటికీ బుధవారం మళ్లీ ఎండలు దంచికొట్టాయి.

Exit mobile version