Israel Bombs Attack : రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 35 మంది మృతి
Israel Bombs Attack : ఇజ్రాయెల్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ తాజాగా దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు గాజా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడులు జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్ రాధాని టెలీఅవీవ్ పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్ తెలిపింది.
అయితే, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. రఫా నగరంపై సూనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్ ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తజాగా మరోసారి బంబు దాడులకు పాల్పడింది.