Dubai Rains : ఇటీవల గల్ఫ్ దేశాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరలో కురిసే వర్షం కొన్ని గంటల్లోనే కురవడంతో నీరు ముంచెత్తింది. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థల్లోకి వరద నీరు చేరి బీభత్సం సృష్టించింది. యుఎఇ, ఒమన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇది క్లౌడ్ సీడింగ్ వల్లనా లేదా మరేదైన ప్రకృతి వైపరీత్యమా..? అనే సందేహంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎడారి దేశంలో హఠాత్తుగా ఎలా వర్షాలు పడ్డాయో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇది స్వతహాగా ప్రకృతి విపత్తు అని విశ్లేషకులు, పరిశోధకులు పేర్కొంటున్నారు.
క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షం వల్ల ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దుబాయ్ ఏప్రిల్ 15, 16 తేదీల్లో క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలను నడిపింది. క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలు వెళ్లాయని గల్ఫ్ స్టేట్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది. రెండు రోజుల్లో ఈ విమానాలు ఏడుసార్లు ప్రయాణించాయి. దాని ఫలితంగానే దుబాయ్ లో వర్షం పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.