Rain Alert : దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మే 11 నుంచి 15 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 13న పోలింగ్ రోజు కూడా వానలు పడే అవకాశముంది. నిన్న, మొన్నటి తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండుటెండలో ఓటేసేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించరని భావిస్తుండగా.. ఇప్పుడు వానలు పడి వాతావరణం చల్లబడడంతో ఓటింగ్ మీద ప్రభావం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సికి్కం బీహార్, గోవా, గుజరాత్, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మే 11 నుంచి 15 వరకు కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.