Railway track blasting : రైల్వే ట్రాక్ పేల్చివేత.. జార్ఖండ్ లో దుండగుల దుశ్చర్య

Railway track blasting
Railway track blasting : జార్ఖండ్ లో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో రైల్వేట్రాక్ ను పేల్చేశారు. దీంతో 39 మీటర్ల మేర రైల్వేట్రాక్ ఎగిరిపడింది. పేలుడు ధాటికి ట్రాక్ కింద మూడు అడుగుల గోతులు ఏర్పడ్డాయి. సాహిబ్ గంజ్ జిల్లా రంగాగుట్ట గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే ఈ రైల్వే ట్రాక్ భారతీయ రైల్వే నెట్ వర్క్ లో భాగం కాదని అధికారులు తెలిపారు.
జార్ఖండ్ లో బొగ్గు రవాణాకు వినియోగించే రైల్వే ట్రాక్ లో కొంత భాగాన్ని పేల్చివేశారు. దీని వెనుక క్రిమినల్ ముఠాల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కసం గాలిస్తున్నారు.