Railway : రైల్వే కొత్త యాప్.. వచ్చేనెల లాంచ్..

Railway

Railway

Railway New App : భారతీయ రైల్వే దాదాపు 70 ఏళ్ల తర్వాత ఒక్కొక్కటిగా దాని రూపు రేఖలు మార్చుకుంటోంది. ఎంతలా అంటే ఇప్పుడు ఇండియన్ రైల్వే జపాన్ లాంటి దేశంతో పోటీ పడాలని ఉవ్విళ్లూరేంతగా. అవును అందుకే చాలా చేంజెస్ తీసుకువస్తుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ తీసుకువచ్చిన ఇండియన్ రైల్వే భద్రమైన ప్రయాణాన్ని కల్పించింది. గతంలో డోర్స్ తీసి ఉన్న ట్రైన్స్ లలో ప్రయాణం కొనసాగేది. అంటే ఎవరైనా డోర్ వద్ద నిల్చుంటే మరణం అంచుల వరకు వెళ్లినట్లే. ఇక దీంతో పాటు వేగం, సమయంను దాదాపుగా పాటిస్తుంది. టికెట్ బుకింగ్ లో కూడా చాలా మార్పులు తీసుకువచ్చింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణం విరమించుకుంటే కూడా వేగంగా డబ్బులను రీఫండ్ చేస్తుంది. రైల్వే శాఖ నిర్వహిస్తున్న ‘ఐఆర్‌సీటీసీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైల్వే శాఖకు సంబంధించి ప్రతీ వసతిని ఇందులో నుంచే బుక్ చేసుకోవచ్చు. ఎంతలా అంటే ప్రయాణానికి సంబంధించి టికెట్ బుకింగ్ నుంచి మళ్లీ రైలు దిగి ఇంటికి వెళ్లే టాక్సీ వరకు అన్నీ ఇందులో నుంచే బుక్ చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడున్న ఐఆర్‌సీటీసీ యాప్ స్థానంలో ‘సూపర్’ యాప్ ను తీసుకురానుంది. ఇందులో నుంచి కూడా టికెట్, ట్రెయిన్ స్టేటస్, ఫుడ్, ఇంకా చాలా విషయాలు బుక్ చేసుకోవచ్చు. అయితే దీనిపై మీమర్స్ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. గతంలో ఐఆర్ సీటీసీలో టికెట్లు కరెక్ట్ గా బుక్ కాలేదని, ఇప్పుడైనా బుక్ అవుతాయా? అని వ్యంగంగా మీమ్ క్రియేట్ చేశారు.

TAGS