BJP celebrations : ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్ మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో బాణసంచా కాల్చి ఆ పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ల అశ్వినీ వైష్ణవ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగానే.. క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారని చెప్పారు. రైల్వే లైన్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని పురందేశ్వరి తెలిపారు.