Rahul Gandhi:2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహక చర్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు ఏపీ నేతలను కలుస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి రాజు, కొత్తగా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణికం ఠాగూర్ హాజరుకానున్నారు.
అక్రమ భూ, ఇసుక, మద్యం మాఫియా నుంచి కోట్లాది రూపాయలు వైఎస్సార్సీపీ నేతలకు చేరుతున్నాయని రుద్రరాజు ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేశారని, ఈ మోసం ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని రాజు ప్రశ్నించారు. జగన్ పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని మడకశిర తహశీల్దార్ వీడియో ద్వారా బట్టబయలు చేసిందన్నారు.
ఇలాంటి అవినీతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదన్నారు. ఏపీసీసీ కొత్త చీఫ్‌గా వైఎస్ షర్మిల నియమితులైనట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రుద్రరాజు ఖండించారు. అయితే ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఏపీలో పంజుకునేనా?..వైఎస్ జగన్, చంద్రబాబుల ప్యూహాలను అదిగమించి తెలంగాణలో సాధించిన ఫలితాల ఉత్సాహంతో రాహుల్ కాంగ్రెస్‌ని అక్కడ ఫామ్‌లోకి తీసుకొచ్చేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.