Harish Rao : తెలంగాణ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

Harish Rao
Harish Rao : నిర్మల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అబద్దాలు మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. హామీల అమలుపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అబద్దాలాడటమే కాకుండా రాహుల్ గాంధీతో కూడా అబద్దం ఆడించారని, ఇది సిగ్గు చేటైన విషయమని విమర్శించారు. రాహుల్ తన స్థాయిని కాపాడుకోవాలంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో ఐదు పథకాలని, తెలంగాణలో ఆరు గ్యారంటీలని మోసం చేస్తున్నారని, అమలు కాని హామీలు అమలవుతున్నాయని చెప్పిన రాహుల్ తక్షణమే భేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మోదీ నల్లధరం తెస్తానని మోసం చేశారు. రాహుల్ ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేశారని, రాహుల్ చెప్పినట్లు డబ్బులు పడకుంటే కాంగ్రెస్ నేతలను మహిళలు నిలదీయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.