property dispute : మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల విషయంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిలకు వాటా విషయంలో వైఎస్ జగన్ కోర్టు మెట్లెక్కారు. దీంతో ఈ ఫ్యామిలీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేగింది. జగన్, షర్మిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో వైసీపీ, కాంగ్రెస్ నేతలు సైతం పరస్పరం విమర్శలు చోటు చేసుకుంటున్నారు. ఇక వైఎస్ షర్మిలపై పలువురు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు సైతం చేస్తున్నారు. అన్న ఆస్తుల కోసం షర్మిల కుట్రలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నాచెల్లెళ్ల ఆస్తుల వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ కూడా షర్మిలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే పీసీసీ పదవి నుంచి తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉన్న ఫళంలా ఢిల్లీకి రావాలని పిలుపు నిచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం విజయమ్మ లేఖ రాయడం.. దానికి కౌంటర్ గా జగన్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆస్తులు పంచాలని షర్మిల గట్టిగా పోరాడుతుంది. అది తన ఆస్తి అని అందుకే తనకు ఆస్తిలో భాగం ఉంటుందని షర్మిల వాదిస్తోంది. కానీ జగన్ ఆస్తుల్లో వాటా ఇచ్చేదే లేదని గట్టిగా ఉన్నారు. షర్మిల వల్ల తనకు భారీగా డ్యామేజ్ జరిగిందని జగన్ వాదిస్తున్నారు. ఇద్దరి మధ్య ఓ ఒప్పందం అయితే ఈ గొడవకు ఎండ్ కార్డు పడుతుందని కొందరు అంటున్నారు. ఒక వేళ ఒప్పందం కుదిరినా దానికి ఆమె కట్టుబడి ఉంటుందా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ వ్యవహారం కాబట్టి ఇది కోర్టులో తేలే అవకాశం లేదు. కారణం ఆస్తులన్నీ జగన్, భారతీ రెడ్డి పేరు మీద ఉన్నాయి. ఆస్తులు అటాచ్ మెంట్ ఉంటే ఈ ఆస్తులు ఎవరికీ చెందవు కాబట్టి.. షర్మిల జగన్ ను పూర్తిస్థాయిలో అల్లరి చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి వల్ల వైఎస్ఆర్ కు భారీగా డ్యామేజ్ ఏర్పడుతుంది. దీని వల్ల కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. షర్మిల వల్ల ఇప్పటి వరకు పార్టీకి జరిగిన ప్రయోజనం ఏం లేదు అందుకే ఆమెను పీసీసీ చీఫ్ గా తప్పించే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. ఆమె పీసీసీగా ఏం చేసిందో ఐదు నెలల రిపోర్టు తీసుకుని రావాలని షర్మిలకు సూచించినట్లు సమాచారం.