Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్ లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షల పైగా మెజార్టీ సాధించారు. అటు ఉత్తర్ ప్రదేశ్ లోని తమ కంచుకోట రాయబరేలీలో 3.7 లక్షల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రెండు స్థానాల్లో విజయం సాధించిన రాహుల్ ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది.
ఉత్తర ప్రదేశ్ లో ఇండియా కూటమి ఊహించని ఫలితాలను సాధిస్తోంది. కూటమి మద్దతుతో సమాజ్ వాదీ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు మొత్తం 36 చోట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. అమేథీ బరిల ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 48 వేల ఓట్లతో వెనుకంజలో ఉండగా.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి (ఇండియా కూటమి) కిశోర్ లాల్ శర్మ ముందంజలో ఉన్నారు. అధికార బీజేపీ అభ్యర్థులు మొత్తం 33 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకు గానూ ఎస్పీ 46, బీజేపీ 33, కాంగ్రెస్ 8, ఆర్ఎల్డీ 2, ఇతరులు 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు.