Rahul Gandhi : కొత్త ఇంటికి రాహుల్ గాంధీ..ఆఫర్ చేసిన హౌస్ కమిటీ

Rahul Gandhi
Rahul Gandhi :కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారనున్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించనుంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5ను హౌస్ కమిటీ ఆయనకు ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఈ బంగ్లాను చూసేందుకు రావడంతో దీనిపై వార్తలు మొదలయ్యాయి. ఆ ఇంటి విషయంలో రాహుల్ రిప్లై ఇవ్వడమే ఇంకా మిగిలి ఉన్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఎంపీగా విజయం సాధించారు. ఈసారి ఆయన లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అది క్యాబినెట్ ర్యాంకు హోదా కావడంతో టైప్ 8 బంగ్లాను పొందేందుకు ఆయన అర్హులు. టైప్ 8 బంగ్లాను క్యాబినెట్ మంత్రుల, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయ మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు.