JAISW News Telugu

Rahul Gandhi : పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ: సీడబ్ల్యుసీ తీర్మానం

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi : శనివారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావే శంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని లోక్‌సభ లో ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకునేందుకు సీడబ్ల్యుసీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా నాయకత్వం వహించడానికి రాహుల్ సరైన వ్యక్తి అన్నారు.

2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన సంఖ్యాబలం (లోక్ సభ సభ్యుల్లో 10 శాతం) లేదు. 2019లో కాంగ్రెస్ 52 స్థానాల్లో గెలవగా, అంతకుముందు 2014లో 44 సీట్లతో సరిపెట్టుకుంది.

Exit mobile version