JAISW News Telugu

Raheman : మరోసారి భారీ స్కోర్ దిశగా రహెమాన్.. చాలా గ్యాప్ తర్వాత..

Raheman

Raheman

Raheman : ఒకప్పుడు దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆయన సంగీతమే వినిపించేది. ప్రపంచలోని టాప్ డ్యాన్సర్ మైకెల్ జాక్సన్ విభావరిలో పాల్గొనాలని ఆహ్వానాలను అందుకున్నాడు. ఇండియాకు మొదటి ఆస్కార్ తీసుకువచ్చాడు. ఆయనే ఏఆర్ రహెమాన్. ఆయన సంగీతం అంటే అసాధారణం అని గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కొంత కాలం పెద్దగా రాణించలేకపోయాడు. డీఎస్పీ, థమన్, అనిరుధ్ వంటి సంగీత దర్శకులు కూడా ఆయన టీంలో పని చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.

90వ దశకం, 2000వ దశకం తొలినాళ్లలో రెహమాన్ సంగీతం మాయాజాలానికి ఏ మాత్రం తీసిపోలేదు. రోజా, బాంబే, తాల్, దిల్ సే,  ప్రేమికుడు, ఇండియన్, రంగీలా, జెంటిల్ మన్, ప్రేమదేశం, లగాన్, సఖి, స్వదేశ్, రంగ్ దే బసంతి, గురు, ఏ మాయ చేసావే, రాక్ స్టార్ వంటి చిత్రాలకు హిట్ సంగీతం అందించాడు.

అయితే ఈ మధ్య కాలంలో రెహమాన్ అవుట్ పుట్ బాగా తగ్గుముఖం పట్టింది. లింగా, మొహెంజొదారో, 2.0, బిగిల్, మెర్సల్, హీరోపంటి 2 వంటి చిత్రాలు ఆశించినంత అభిమానం అందుకోలేకపోయాయి. పొన్నియిన్ సెల్వన్ కోసం ఆయన చేసిన స్కోర్ కూడా తన గత చిత్రం తాలూకు హైప్ ను క్రియే్ చేయలేక విఫలమైంది. ఈ ప్రాజెక్టుల్లో అతని సంగీతం గత జ్ఞాపకాలను అందించడంలో విఫలమైనట్లు తీవ్రంగా విమర్శలు వినిపించాయి.

ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ రీఎంట్రీ ఇచ్చారు. ‘ఆడుజీవితం’ అనే మలయాళ చిత్రం కోసం ఆయన పాడిన అందమైన బాణీలకు మంచి ఆదరణ లభించింది, ‘చంకిలా’కు ఆయన అందించిన స్కోర్ సినిమాకు కొత్త జీవం పోసింది.

ఇటీవల ధనుష్ హీరోగా నటించిన ‘రాయన్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే కోసం రాయన్ మిశ్రమ ప్రతిస్పందనలను అందుకున్నప్పటికీ, రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతం ఏకగ్రీవంగా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నాయి. తాను ఇప్పటికీ ఆకర్షణీయమైన, చిరస్మరణీయమైన స్వరాలను సృష్టించగలనని ఈ చిత్రాలతో నిరూపించుకున్నాడు.

రెహమాన్ తన సినీ కెరీర్ లో 32 ఏళ్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో ఆయన రీసెంట్ ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ లో భారీ మార్పు వచ్చింది. ‘చావా’, నితేష్ తివారీ ‘రామాయణం’ వంటి భారీ ప్రాజెక్టులు తెరపైకి రావడంతో 90, 2000 దశకాల్లో ఆయన స్వరాలు మరింత ఎక్కువ హిట్ అవుతాయని అభిమానులు, విమర్శకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version